పన్నులు చెల్లించండి.. అభివృద్ధికి సహకరించండి:మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి 

నవతెలంగాణ- దుబ్బాక
ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు,నల్లా బిల్లులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి కోరారు.శుక్రవారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని 13,14,18 వార్డులను ఆయన సందర్శించారు.పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లులు,ఇంటి పన్నులు చెల్లించాలని.. వ్యాపారస్తులు విధిగా ట్రేడ్ లైసెన్స్ లను తీసుకోవాలన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ, రూ.2 కోట్ల టార్గెట్ ఉండగా.. ప్రస్తుతం రూ.1 కోటి 10 లక్షలు వసూలయ్యాయని.. మరో రూ.90 లక్షల బకాయిల్ని త్వరలోనే వసూలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం 18వ వార్డులోని చిల్డ్రన్స్ పార్క్ ను పరిశీలించి..పార్కును శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.ఆయన వెంట మేనేజర్ శ్రీనివాస్,వర్క్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్,వార్డు ఆఫీసర్లు,మున్సిపల్ ఉద్యోగులు,సిబ్బంది ఉన్నారు.