– ఉప ముఖ్యమంత్రికి టీపీజేఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షులు గౌరి సతీశ్ నేతృత్వంలో కలిశారు. రాష్ట్రంలో ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించి బకాయిలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ హైదరాబాద్ నాయకులు అహ్మద్, పహిల్వాన్, అక్రం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశ్‌ను గౌరి సతీశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంటర్మీడియెట్ విద్యావ్యవస్థ, ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సమస్యలపై చర్చించామని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.