ప్రజాసంక్షేమాన్ని మరచిన పాయల్ : జోగురామన్న

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రజా సంక్షేమాన్ని మరిచి అభివృద్ధిని పక్కదోవ పట్టిస్తూ తన కబ్జాల వ్యాపారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటని, అలాగే ప్రజా సంక్షేమంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి గులాబీ జెండా ఎగిరెలా శ్రేణులు కృషి చేయాలని బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు.శనివారం పార్టీ కార్యాలయంలో శనివారం మండల ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు  జోగురామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజల నుండి తీవ్ర అసంతృప్తి  అట్టర్ ఫ్లాప్ అనే వరకు  వ్యక్తమయిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తే ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కెసిఆర్ నాయకత్వంలో భారతదేశంలో రైతుబంధు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ అసమర్ధ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగిరెలా శ్రేణులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పూర్తి అసంతృప్తిగా ఉన్నారు అన్నారు. ఎన్నికల ముందు రాముని పేరు జపిస్తూ ఎన్నికలు ముగిశాక కబ్జాలను జపించడం జరుగుతుందని ఎద్దేవా చేశారు. నేడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నేటికీ గ్రామాలలో కొనసాగుతున్నాయని వాటిని స్థానిక కాంగ్రెస్ బిజెపి నేతలు మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం ప్రజల్లో హాస్యస్పదమవుతుందన్నారు. ఆకుర్ల, కొరట గూడ బేల  కొద్దూర్ మసాలా చందా, హస్నాపూర్ గణేష్పూర్, అనుకోలే, యశోద బురికి  ఇలా ప్రతి గ్రామాల్లో  బి ఆర్ఎస్ ప్రభుత్వ నిధులతోనే పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, నారాయణ, యాసం నర్సింగరావు, మెట్టు ప్రలాత్, సేవ్వా జగదీష్, మార్శెట్టి గోవర్ధన్, చందాల రాజన్న, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవర్, గంబి ర్ టాక్రీ, దేవన్న, కొముర, మెస్రం పరమేశ్వర్, పాల్గొన్నారు.