
ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ములుగు జిల్లా అధ్యక్షుడిగా, తాడ్వాయి మండలం కామారం (పిటి) గ్రామానికి చెందిన పాయం కోటేశ్వరరావును శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు, నాపై నమ్మకంతో నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు, తుడుందెబ్బ రాష్ట్ర, నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, వివిద మండలాల తుడుందెబ్బ నాయకులందరికీ, పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పాయం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసి హక్కులు సాధించేందుకు కమిటీలు వేసి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మోకాళ్ళ వెంకటేష్, రాష్ట్ర నాయకులు కోరగట్ల లక్ష్మణరావు, తుడుం దెబ్బ రాష్ట్ర, జిల్లా,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.