నవతెలంగాణ – గోవిందరావుపేట
పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ కూలీల పనుల డబ్బులను వెంటనే చెల్లించాలని పసర సీపీఐ(ఎం) పార్టీ గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలం లోని పస్రా గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు ఉపాధి హామీ పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రజల అకౌంట్లకు డబ్బులు జమ కాలేదు. మండుటెండలో ప్రజలు కష్టం చేసిన రూపాయలు తమ వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయని అనుకుంటే ఇంతవరకు అట్టి రూపాయలు రాకపోయేసరికి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనుక ప్రభుత్వ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ఉపాధి హామీ పనులను రూపాయలు ప్రజల అకౌంట్లో జమ చేయాలని కోరారు.లేనియెడల ప్రజలందరినీ ఏకం చేసి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సోమ మల్లారెడ్డి అంబాల మురళి పల్లపు రాజు జిట్టబోయిన రమేష్ క్యాతం సూర్యనారాయణ కందుల రాజేశ్వరి మంచాల కవిత కారం రజిత తదితరులు పాల్గొన్నారు.