నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రజలకు బీమా సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చే ఒక మార్గదర్శక ప్రయత్నంలో భాగంగా, PBPartners పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకే చోట డైనమిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (PoSP) వ్యాపారం ద్వారా, ‘‘బ్రింగ్ ఇన్సూరెన్స్ టు భారత్’’ అనే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతోంది. జూన్ 2021లో ప్రారంభమైన PBPartners ఏజెంట్ భాగస్వాములతో చురుకుగా వ్యవహరిస్తూ, అంతరాయం లేని డిజిటల్ పరిష్కారాలను అందిస్తూ, భారతదేశపు ప్రముఖ B2B2C డిజిటల్ బీమా ప్లాట్‌ఫారమ్‌గా ఉద్భవించింది.
భీమా వ్యాప్తిని పెంచేందుకు అంకితమైన PBPartners, ముఖ్యంగా భారతదేశంలోని టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో పలురకాల బీమాలు అందించే సదుపాయకులతో కలిసి పని చేస్తుంది. దీని PBPartners లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ మరియు హోమ్ మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి ఇతర ఉత్పత్తులతో సహా పలు రకాల ఎంపికలను అందజేస్తుంది. ఏజెంట్ భాగస్వాములతో (B2B) అనుసంధానం అయ్యే మోడల్‌పై పని చేయడం, వారు వ్యక్తిగత వినియోగదారులను చేరుకునేందుకు (B2C) అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రత్యేకమైన విధానం PBPartners తన ఏజెంట్ భాగస్వాముల ద్వారా వినియోగదారులకు నేరుగా బీమా పరిష్కారాలను అందించడానికి అనుమతిస్తుంది. వినియోగదారుల ఆన్‌బోర్డింగ్‌ను సులభతరం చేసే, ఏజెంట్ల ప్రక్రియను డిజిటలైజ్ చేసే వేగవంతమైన, వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని సృష్టిస్తుంది.
తమ దృష్టి కోణం గురించి PBPartners కంపెనీ చీఫ్ బిజినెస్ అధికారి ధృవ్ సారిన్ మాట్లాడుతూ, ‘‘PBPartners లక్ష్యం ఏమిటంటే, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బీమా పరిష్కారాలను అందుకునేలా చేయడం, దాని నుంచి ప్రయోజనం పొందగలరని నిర్ధారించడం. బీమా ల్యాండ్‌స్కేప్‌ను అన్వేషిస్తున్నప్పుడు, PBPartners వ్యూహాత్మక అంతరాన్ని గుర్తించింది. ముఖ్యంగా తక్కువ అవకాశాలు ఉన్న మార్కెట్‌లో చొచ్చుకుపోయే టైర్ 2 మరియు 3 నగరాల్లో, ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి సూక్ష్మ వ్యాపారవేత్తలు, ఏజెంట్ భాగస్వాముల నెట్‌వర్క్‌ను రూపొందించడానికి దారితీసింది’’ అని తెలిపారు.
‘లాభాలకు మించిన దృష్టితో PBPartners మార్గనిర్దేశం చేస్తుంది. మేము మా ఏజెంట్ భాగస్వాములను సూక్ష్మ వ్యాపారవేత్తలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. విభిన్న బీమా ఉత్పత్తుల గురించి తక్కువగా బీమా సదుపాయాలు పొందుతున్న వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాము. మేము ప్రవాస భారతీయ వినియోగదారులు అందరికీ బీమాను మరింత అందించేందుకు శ్రమిస్తున్నాము. అలాగే మా ఏజెంట్ భాగస్వాములకు ద్వితీయ ఆదాయానికి అవకాశాలను సృష్టిస్తున్నాము’’ అని ఆయన వివరించారు. దాని ఏజెంట్ భాగస్వాములను ‘‘అభివృద్ధిలో భాగస్వాములు’’ PBPartners గుర్తిస్తుంది. వినియోగదారులతో నేరుగా నిమగ్నమవ్వడంలో, అసాధారణమైన సేవలను అందించడంలో మరియు స్థిరమైన సంబంధాలను నిర్మించడంలో వారి కీలక పాత్రకు విలువనిస్తుంది. ఈ పరివర్తన విధానం భీమా ల్యాండ్‌స్కేప్‌ను విప్లవాత్మకంగా మార్చింది; ఇది ఏజెంట్ల ఆర్థిక వృద్ధిని చురుకుగా మారేలా చేస్తుంది. అదనంగా, PBPartners మార్కెట్‌ల వ్యాప్తంగా పాత్‌షాలా ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. ఇది ఏజెంట్లకు ప్రొడక్ట్స్‌పై ఉన్న పరిజ్ఞానం, విక్రయ పద్ధతులు, కంపెనీ అప్‌డేట్‌లు మరియు సంబంధిత అంశాలలో సమగ్ర శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రోయాక్టివ్ విధానం సమర్థవంతమైన పనితీరు కోసం అవసరమైన సమాచారం మరియు సాధనాలతో ఏజెంట్లను సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దాని ఆఫ్‌లైన్ ఉనికిని విస్తరించేందుకు, PBPartners భారతదేశం వ్యాప్తంగా 16 బ్రిక్ అండ్ మోర్టార్ అనుభవ కేంద్రాలను ప్రారంభించి 150 ప్రధాన నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ అనుభవ కేంద్రాలు PBPartners భాగస్వాములు, వ్యాపార సహచరులు మరియు ఉద్యోగులకు ప్రత్యేక కేంద్ర బిందువులుగా పనిచేస్తాయి. సంస్థకు సంబంధించిన అంశాలలో అవగాహనలను రూపొందించే శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం, వాటాదారుల మధ్య సానుకూల మరియు వ్యక్తిగత ఎంగేజ్‌మెంట్లను నెలకొల్పే దిశలో ఇది పని చేస్తుంది. భారతదేశ బీమా ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మించడంలో PBPartners ముందంజలో ఉంది. వినూత్న B2B2C వ్యూహాలు మరియు సరళత, పారదర్శకత మరియు అందరికీ అందుబాటు కోసం కోసం నిబద్ధతతో, కంపెనీ బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఏజెంట్ భాగస్వాములతో చురుగ్గా వ్యవహరిస్తూ, ఆర్థిక చేరికలను ప్రోత్సహించడం మరియు సూక్ష్మ వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించడం ద్వారా, PBPartners భౌగోళిక సరిహద్దులను అధిగమించి, వేగవంతమైన, వ్యక్తిగతీకరించిన బీమా అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.