గత నెల ఆగస్టు 31న సుడిగాలి, టోర్నోడో తరహా లో భారీ సుడిగాలి వచ్చి లక్షకు పైగా చెట్లు కూలి, ప్రకృతి విధ్వంసం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు కూలిన చెట్ల గురించి పరిశోధన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పీసీసీఎఫ్ కంపా(సిఏఎంపిఏ) సువర్ణ, ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, మిగతా ఫారెస్ట్ అధికారులతో కలిసివచ్చి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మేడారంలోని నేలమట్టమైన చెట్ల అటవీ ప్రాంతాన్ని చెట్టు చెట్టుకు తిరిగి పరిశీలించారు. చెట్లు ఎందుకు కూలినాయి ? దానికి సంబంధించిన కారణాలు? తదితర అంశాల గురించి ఫారెస్ట్ అధికారులతో చర్చించారు. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే విషయంలో ఫారెస్ట్ శాఖ అధికారులతో చర్చించారు. అంతు చిక్కని విపత్తుతో భారీ విద్వాంసం ఎలా జరిగింది, అనే సంఘటనపై పరిశోధనలు నిర్వహించారు. కేవలం రెండు గంటల్లోనే తోర్నాడో రీతిలో పెనుగాలులు విధ్వంసం సృష్టించిన విషయాన్ని ఆమె ఆశ్చర్యం గురయ్యారు. టోర్నాడో తరహా బలమైన గాల్లో వల్లే ఇంత విపత్తు చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాలేశ్వరం సిసిఎఫ్ ప్రభాకర్, ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఏటూరు నాగారం ఎఫ్డిఓ ఎస్ రమేష్, ఎఫ్ ఆర్ ఓ లు కృష్ణవేణి, బాలరాజు, అబ్దుల్ రెహమాన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.