పీసీఓడీ సమస్య…

నేడు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్న మహిళలు అధిక సంఖ్యలో వున్నారు. పీసీఓడీ తీవ్రతను ఎదుర్కోవటానికి మహిళలు తన ఆహారంలో చేయవలసిన కొన్ని నియమాలు పాటిస్తే ఇటువంటి సమస్యలు దరిచేరని నిపుణులు చెబుతున్నారు.నేడు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్న మహిళలు అధిక సంఖ్యలో వున్నారు. పీసీఓడీ తీవ్రతను ఎదుర్కోవటానికి మహిళలు తన ఆహారంలో చేయవలసిన కొన్ని నియమాలు పాటిస్తే ఇటువంటి సమస్యలు దరిచేరని నిపుణులు చెబుతున్నారు.
పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ డిసీజ్‌) అనేది స్త్రీ అండాశయాలు అపరిపక్వ గుడ్లను విడుదల చేసే పరిస్థితి. ఇది చివరికి సిస్ట్‌లుగా మారుతుంది. ఈ వ్యాధిని పూర్తిగా వదిలించుకోవడానికి మార్గం లేనప్పటికీ, ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారపు అలవాట్లతో పాటు.. వ్యక్తిగత చికిత్స కూడా వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. ఈ సమస్య వల్ల చాలా మంది మహిళలకు గర్భదారణ సమస్యలు వస్తాయి. దీనికి సంబంధించి ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం.
ఈ సమస్య ఉన్నవారు రెడ్‌ మీట్‌ను తీసుకోకూడదు. వీటిలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటమే కాదు, హార్మోన్ల అసమతుల్యతని కూడా పెంచుతాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పీసీఓడీతో బాధపడేవారు స్వీట్లను తీసుకోరాదు.
తక్కువ తినండి , ఎక్కువగా త్రాగండి
ఈ సమస్యతో బాధపడేవారిలో చేతులు, పాదాలు, చీలమండలు వాపు వస్తుంది. అందువల్ల రోజంతా పుష్కలంగా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
ఫ్లాక్స్‌ సీడ్‌, బాదం, నువ్వులు వంటి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈస్ట్రోజెన్‌, ఇన్సులిన్‌ వంటి హార్మోన్ల సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే చికెన్‌, గుడ్డులోని తెల్లసొన, పెరుగు, సాల్మన్‌లను చేర్చుకోవాలి.