
మండల కేంద్రంలోని ఉపడి హామీ పథకం, మండల సమాఖ్య కార్యాలయాన్ని డిఅర్డిఏ పిడీ చందర్ నాయక్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపది హామీ పథకం, మండల మహిళా సమాఖ్య కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మండల సమాఖ్య నందు విఓఏల సమీక్ష సమావేశానికి హజరై విఓఏ ల పనితీరు పై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు ఋణాలు లక్ష్యం, మంజూరు చేయించాలని, పిఏంఎఫ్ సి ఋణాలు, న్యూ ఎంటర్ జేసీ, ఇతర అంశాలపై జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉండాలని సిసిలను బంగలను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి క్రాంతి డీపిఎం మారుతి, ఎపిఎం అనిల్ కుమార్, విఓఏ లు పాల్గొన్నారు.