
నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ డిప్యూటీ తాసిల్దార్ శ్రీ కృష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బాచు ఎల్లయ్య మడిగలో, అక్రమంగా నిలువ ఉంచిన నాలుగు క్వింటాళ్ల 20 కిలోల బియ్యాన్ని పట్టుకొని, స్థానిక రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్సై అంబీర్ భువనేశ్వర్ రావు, పోలీస్ సిబ్బంది సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.