నవతెలంగాణ – ఆర్మూర్
పీడీఎస్ యూ 50 వసంతాల సందర్భంగా పట్టణ కేద్రంలో స్వర్ణోత్సవ ర్యాలీ సోమవారం నిర్వహించటం జరిగింది. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎక్సిబిజన్ గ్రండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యలి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు ఏం,నరేందర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా సీపీఐ ఎంఎల్ మస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి, ప్రభాకర్, పిడిఎస్యు మాజీ నాయకులు పార్టీ డివిజన్ కార్యదర్శి బి,దేవారం లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల చరిత్ర కలిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవాల జరుపుకుంటున్నాం. ఉస్మానియా యూనివ్సిటీలో లో కామ్రేడ్ జార్జిరెడ్డి తో విద్యార్థి ఉద్యమం మొదలై అమ్మాయిల పైన జరుగుతున్న ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి పీడీఎస్ యూ ను స్థాపించి నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమం అంచలంచలు ఎదిగి విద్యార్థుల హక్కుల గొంతుకగా పీడీఎస్ యూ అవతరించిందని వారన్నారు.
ఎన్నో త్యాగాల ఫలితంగా విద్యార్థుల సమస్యలు పరిష్కార దిశగా సాగాయని ప్రభుత్వాల మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కోసం పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. వారి బాటలోని నిజాంబాద్ జిల్లా బోధన్ ఎతుండ గ్రామానికి చెందిన జే సి ఎస్ ప్రసాద్ పోరాటాన్ని ముందుకు నడపాలని ఉద్యమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఎమర్జెన్సీకి కాలంలో కూడా భయపడకుండా ముందుకు నడిచారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, కార్యదర్శి గణేష్ లు మాట్లాడుతూ.. 50 వసంతాల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 30 తారీకున ఉస్మానియా యూనివర్సిటీలో సభ ఉందని అన్నారు. సమ సమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్య సాధన కోసం కలిసికట్టుగా జార్జిరెడ్డి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని వారు అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సభను విజయవంతం చేసిన ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రతి ఒక్కరు కూడా జార్జిరెడ్డి ఆశయ సాధన ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతంలో విద్యార్థుల సమస్యల పట్ల పీడీఎస్ యూ 50 ఏళ్లుగా పోరాటం చేస్తుందని వారి దారిలోని మనమందరం కూడా నడవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, ఏరియా నాయకురాలు మమత, సిద్ధార్థ ,బీరుగొండ, నితిన్, సాయి, వినయ్, వేలాదిమంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.