పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని నిరసన: పీడీఎస్ యూ

Protest to solve the problems in the school: PDSUనవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్, బాలికల కస్తూర్బా పాఠశాల కళాశాలలో సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయని, వీటిని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పరిష్కరించకపోవడానికి నిరసిస్తూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పీడీఎస్ యూ  ఏరియా కమిటీ శనివారం వర్షంలో  మోడల్ స్కూల్ ముందు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట వర్షంలో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్.. ఏరియ ప్రధాన కార్యదర్శి  నిఖిల్ లు మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలో ప్రభుత్వ మోడల్ బాలికల కస్తూర్బా పాఠశాల కళాశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. వారికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడ విద్యా అధికారులు మునిసిపల్ అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కానీ సంవత్సరాలు గడుస్తున్న ఎంత చెప్పినా అంతే విధంగా సమస్యలు ఉన్నవి గత వర్షాకాలంలో కూడా విద్యార్థులు చాలా అవస్థలు పడితే మోడల్ స్కూల్ ముందు నీటి ప్రవాహం నదిలా ఉందని తెలియజేసిన చర్యలు తీసుకోలేదు అని అన్నారు. కస్తూర్బా కళాశాలలో అడవిని తలపించేలా చెట్లు చెదలు గడ్డి ఉన్నవని వాటిని పరిష్కరించండి అని విద్యార్థులకు దోమలు కీటకాలు బ్యాక్టీరియా ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పిన కూడా చెప్పినంత లోపే ఇద్దరు అధికారులు వచ్చి పోవడం జరుగుతుంది. కానీ సమస్య ఇప్పటివరకు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకు మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవడం లేదు చెప్పాలని ఎమ్మెల్యే మీకు ఈ సమస్య దృష్టిలో ఉండి కూడా ఎందుకు పరిష్కరించడం లేదు చెప్పాలి మేము పిడిఎస్సి గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం విద్యార్థులతో బయట ఇస్తాం ధర్నా చేస్తాం అని చెప్పేసి చెబుతా ఉన్నాం కావున తొందరగా ఈ సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు సిద్ధార్థ మమత తదితరులు పాల్గొన్నారు.