యూనివర్సిటీ అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించాలి: పీడీఎస్ యూ

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 200 కోట్ల నిధులను కేటాయించాలని పీ.డీ.ఎస్. యూ యూనివర్సిటీ నాయకులు మోహిత్,రవీందర్ లు డిమాండ్ చేశారు. శనివారం  యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లో పీ.డీ.ఎస్. యూ యూనివర్సిటీ కమిటీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ లో విద్యార్థినిలకు హాస్టల్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని , యూనివర్సిటీ లో ఆడిటోరియం ,నూతన హాస్టల్స్ నిర్మించాలని,స్పోర్ట్స్ కి మినీ స్టేడియం నిర్మించి ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని,వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలని ,ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని , రెండవ  కేటగిరి లో  పి హెచ్ డి నోటిఫికేషన్ విడుదల చేయాలని, తెలంగాణ యూనివర్సిటీ  అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో  200 కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ నాయకులు అక్షయ్,ఆకాష్,హన్మాండ్లు, శివసాయి , సాయి ప్రకాష్ తదితరులు  పాల్గొన్నారు.