నారాయణ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి : పీడీఎస్‌యూ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కలుషిత ఆహారంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ర్యాంకుల పేరుతో పరిమితికి మించి విద్యార్థులను ఇరుకు గదుల్లో బలవంతంగా ఉంచడం సరైంది కాదని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకున్నా నారాయణ కాలేజీ యాజమాన్యం వసతి గృహాలను నడుపుతున్నదని పేర్కొన్నారు. దీనికి ఇంటర్‌ బోర్డు అధికారుల సహకారం ఉందని వివరించారు. కార్పొరేట్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లను ప్రభుత్వం తనిఖీ చేసి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.