ఈనెల 12 ,13 తేదీల్లో మోపాల్ శివారులోని ప్రెసిడెన్సీ స్కూల్ లో నిర్వహించే బాలోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులను కోరారు.శనివారం డిచ్ పల్లి మండల కేంద్రంలో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జిజ్ఞాస ను పెంచుకోవడానికి, సృజనాత్మకతను వెలికి తీయడానికి బాలోత్సవ కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడతాయని, మన దేశంలో సైంటిస్టులు,మేధావులు లక్షల సంఖ్యలో తయారు కావలసిన అవసరం ఉందని, ఆ వైపుగా విద్యార్థులు అడుగులు వేయాలని, ఈ కార్యక్రమాలను 7 నుండి 10 తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల కూడా విద్యార్థులను స్వచ్ఛందంగా బాలోత్సవ కార్యక్రమానికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, తెలంగాణ యూనివర్సిటీ నాయకులు రవీందర్, అక్షయ్ ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.