డిగ్రీ కళాశాలను తక్షణమే ఏర్పాటు చేయాలి: పీడీఎస్ యూ

A degree college should be set up immediately: PDSU– పీడీఎస్ యూ నెల్లికుదురు మండల కమిటీ ఎన్నిక
– పీడీఎస్ యూ తొర్రూరు డివిజన్ కార్యదర్శి గోడిశాల మనోజ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్ యూ తొర్రూరు డివిజన్ కార్యదర్శి గోడిషాల మనోజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో పీడీఎస్ యూ మండల కమిటీని ఎన్నుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధమంగా నూతన మండల ఎన్నుకున్నమన్నారు. పీడీఎస్ యూ నూతన నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా గుగులోత్ అనిల్, కార్యదర్శిగా బానోత్ నందీశ్వర్,ఉపాధ్యక్షునిగా నేతావత్ రామ్ చరణ్,కోశాధికారిగా బానోత్ సాయి కుమార్,సహాయ కార్యదర్శిగా బానోత్ సాగర్ కమిటీ సభ్యులుగా సిద్దు,భిక్షం,మహేష్,మనోజ్,వెంకట్ రామ్,బన్నీ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ పరస్పర సహకారాలు అందించుకుంటూ విద్యార్థుల పక్షాన నిలిచి పోరాటం చేయాలని సూచించారు మండల పరిధిలో ఎప్పటినుంచో ఉన్న ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా పాఠశాలలు పునఃప్రారంభం అయి రెండు మాసాలు కావొస్తున్న నేటికీ కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు,యూనిఫాంలు ఇవ్వని పరిస్థితి ఉంది. వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థులు,రాజు,నరేష్,కుమార్,సందీప్,మమత,శ్రావ్య,భవ్య, సంద్య తదితరులు పాల్గొన్నారు.