
తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి కి పీడీఎస్ యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ పీడీఎస్ యూ కార్యదర్శి జయంతి మాట్లాడుతూ బాలికలకు అదనంగా హాస్టల్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని, అదేవిధంగా హెల్త్ కేర్ లో డాక్టర్ ను నియమించాలని అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలని, మెస్ బిల్లులపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని,యూనివర్సిటీ లో ఆడిటోరియం తో పాటు మినీ స్టేడియం నిర్మించాలని, వైఫై,విది దీపాలు పెట్టాలని ,స్పోర్ట్స్ కి ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని , జిమ్ ను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ జిల్లా నాయకురాలు దేవిక, నాయకులు రవీందర్ ,అక్షయ్ ,హనుమాన్లు, బిందు పాల్గొన్నారు.