పిడిఎస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నీ విజయవంతం చేయండి..

PDSU State General Council make you successful..నవతెలంగాణ – డిచ్ పల్లి
ఫిబ్రవరి 4 ,5 తేదీల్లో భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగు పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ముందు వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పి.డి.ఎస్.యు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. నరేందర్, డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 7500 కోట్ల రూపాయల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో లక్షలాదిమంది పేద విద్యార్థులు ఆర్థికపరమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, యుజిసి అధికారులు రాష్ట్రాల్లోని ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే సంస్కరణలు తీసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించకుండా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రతిపాదన భర్తీ చేయాలని, పీహెచ్డీ అడ్మిషన్ పొందిన పరిశోధక విద్యార్థులందరికీ ఫెలోషిప్ ఇవ్వాలని, హాస్టల్స్ లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్య రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యార్థి వ్యతిరేక సంస్కరణలపై రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో విద్యార్థి ప్రతినిధుల సమక్షంలో సమగ్రంగా చర్చించి, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించటం జరుగుతుందని తెలిపారు. *పి.డి.ఎస్.యు. రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ ప్రారంభిస్తారని,” మతోన్మోద ఫాసిజం -విద్యార్థులపై దాని ప్రభావం” అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రమేష్ పట్నాయక్ బోధిస్తారని, “జాతీయ ఉద్యమంలో విప్లవ విద్యార్థుల పాత్ర” అనే అంశాన్ని పి.డి.ఎస్.యు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల అశోక్ బోధిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. నిజామబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు వినోద్, నాగేష్, సునీల్, సంతోష్, ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.