దైవ చింతనతో మానసిక ప్రశాంతత

– ఆధ్యాత్మిక చింతన శ్రీరామరక్ష

– శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా 16 రోజుల పండుగ వేడుకలు
– ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటకండ జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-పెన్ పహాడ్ 
సీతా రామచంద్రస్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. మండలంలోని మాచారం గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ 16 రోజుల పండుగ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ రాబోయే కాలం అంతా మంచే జరుగుతుందన్న ఆశావాద దృక్పథం అలవడుతుంది. దాంతో, చేసే పనిపై శ్రద్ధ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనకు వయసుతో మతంతో సంబంధం లేదన్నారు. ఏ వయసువారైనా ఏ మతం వారైనా నిక్షేపంగా వారి ఆచారాలకు అనుగుణంగా దైవధ్యానాన్ని చేసుకోవచ్చు అన్నారు. దైవ ధ్యానంలో మానసిక ప్రశాంతతను పొందవచ్చని అన్నారు. అంతేగాని, ఆధ్యాత్మిక చింతనని కేవలం వృద్ధులకు పరిమితం చేయకూడదన్నారు. సాధారణంగా వయసైపోయిన కారణంగా చుట్టుముట్టే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం ఆధ్యాత్మిక చింతనను దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటారన్నారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనను దైనందిన జీవితంలో భాగముగా చేసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, సర్పంచ్ లు బోల్లక సైదమ్మ బొబ్బయ్య, బిట్టు నాగేశ్వరరావు, చీదేళ్ళ ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.