– ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ ఘనంగా మైసమ్మ దేవత పండుగ
నవతెలంగాణ-దోమ
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత పొందవచ్చునని పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దోర్నాలపల్లి గ్రామంలో మైసమ్మ దేవత పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేను పూలదండ, శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మాలి.విజరు కుమార్ రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్, దొంగ ఎన్కేపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.