ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

నవతెలంగాణ – రాయపర్తి : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత పొందవచ్చు అని గ్రామాల్లో దుర్గామాతలను ప్రతిష్టించి నవరాత్రులు పూజించడం సంతోషకరమని ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాట్రపల్లి, కొండూరు, తిర్మలాయపల్లి, గన్నారం, సన్నూరు, పేర్కవేడు తదితర గ్రామాల్లో ప్రతిష్టించిన దుర్గామాతలను సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టి దుర్గామాత ప్రతిష్టాపన కమిటీలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతియుత సమాజాన్ని నెలకొల్పుడంలో ఆధ్యాత్మిక మార్గం అతి ముఖ్యమైనదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో భక్తి భావంతో దుర్గ మాతలను ప్రతిష్టించి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. ఎస్ఆర్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఉపోద్ఘాటించారు. మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెతాకుల మధుకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, సురేందర్ రాథోడ్, నాయకులు కర్ర రవీందర్ రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, పులి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.