– కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు సాదు నాగరాజు
నవతెలంగాణ – శాయంపేట
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సాదు నాగరాజు అన్నారు. బుధవారం శాయంపేట గ్రామంలోని తన నివాసంలో హనుమాన్ పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలోని హనుమాన్ విగ్రహానికి పాలాభిషేకం చేసి చందనం వేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు