
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలలో 4.020 టీజీటీ పోస్టుల తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు శుక్రవారం విడుదల చేయడంతో మహ ముత్తారం మండలం దొబ్బల పాడ్ గ్రామానికి చెందిన హాట్కర్ జ్యోతి టిజిటి మ్యాథమెటిక్స్, జరుపుల శ్రీనివాస్ టిజిటి ఇంగ్లీష్, ఆలోత్ వినోద్ కుమార్ కొర్లకుంట టిజిటి, పిజిటి జూనియర్ లెక్చరర్ గా కొలువులు సాధించారు. గతేడాది ఆగస్టు 3 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో మహ ముత్తారంకు మూడు కొలువులు దక్కాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.