పెద్దవాగు ప్రాజెక్ట్ రింగ్ బండ్ కు గండి

Peddaagu Project Ring Bund to Gandiనవతెలంగాణ – అశ్వారావుపేట

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా సంభవిస్తున్న వర్షాలతో మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట లో శనివారం 11.8,ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 110.9 మి.మీ వర్షపాతం నమోదు అయింది. దీంతో జులై లో భారీ వర్షాలకు గండి పడ్డ గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ కు నిర్మిస్తున్న రింగ్ బండ్ కు శనివారం తెల్లవారు జామున గండిపడింది.తాత్కాలిక మరమ్మత్తులు సైతం నిలిచిపోయాయి. ఈ ఏడాదే వ్యవసాయానికి నీరు అందించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ,రెవిన్యూ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లు రూ.3 కోట్ల 50 లక్షలు వెచ్చించి రింగ్ బండ్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు.ఈ పనులు సైతం సీతారామ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ కే అప్పగించారు.250 మీటర్లు మేర 90 శాతం పనులు పూర్తి చేసారు. కానీ గత రెండు రోజులు గా ఎడతెరిపిలేని వానలకు భారీ గా నీరు చేరడంతో 30 మీటర్లు మేర కోతకు గురై రింగ్ బండ్ కు గండి పడింది. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగంలో నాణ్యతా ప్రమాణాలు కొత్తగూడెం డీఈఈ రవీందర్,పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తుల పనుల నిర్వహణ డీఈఈ మోతీలాల్,ఏఈఈ లు నవీన్,వంశీ లు గండిని పరిశీలించారు.