
గట్టుప్పల మండలం కేంద్రం లో పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికను నల్గొండ జిల్లా ఎక్సయింజ్ శాఖ అధికారి దశరథ అద్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన పెద్దగోని కుమార్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెద్దగోని కుమార్ మాట్లాడుతూ ఈ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.కమిటీ ,సంఘ సభ్యులందరి సహకారంతో సంఘ అభివృద్ధికి ఎలాంటి వివక్ష లేకుండా పనిచేస్తానని చెప్పారు. ఈ సంఘం ఉపాధ్యక్షులుగా పెద్దగోని ముత్యాలు, కార్యదర్శిగా భీమగాని వెంకటేశం, కోశాధికారిగా మాదగాని రామస్వామి, సంయుక్త కార్యదర్శిగా పెద్దగోని యాదయ్య సభ్యులుగా నీల శంకరయ్య, పెదగోని గణేష్, బండారు మల్లేష్, పెద్దగోని రాములు, కర్నాటి అబ్బయ్య ,పెద్దగోని దేవేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు పెద్దగోని ముత్యాలు, మాదగాని సత్తయ్య, భీమగాని యాదయ్య, పెద్దగోని సత్తయ్య ,భీమగాని మల్లేష్ ,పెద్దగోని రాఘవేంద్ర,శ్రీనివాస్,మాదగాని గోపాల్,వెంకటేష్ బండారు సత్తయ్య, పెద్దగోని నర్సింహ,మునుకుంట్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.