నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సోమవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.