
నవతెలంగాణ – మిరు దొడ్డి
మిరుదొడ్డి మండలం కాసులాబాద్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మ విగ్రహ ప్రతిష్టోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ- పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని భాస్కర్ రావు పంతులు వేదమంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు, ఓడిబియ్యము సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ మారం అమ్మవారి నామస్మరణతో ఆలయం మారు మ్రోగింది. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ దయతో సకల శుభాలు కలుగుతాయి. అమ్మ దయతో సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్టతో పాటు పెద్దమ్మ పెద్దిరాజు కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. అమ్మవారి దయతో పాడిపంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధార్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ పెద్దిరాజుల కమిటీ సభ్యులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్ రావు, నాయకులు బాలరాజు , లింగం, సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, బాపురెడ్డి, దుర్గారెడ్డి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.