
కాంగ్రెస్ నాయకులకు పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ ఆహ్వాన పత్రిక అందించారు. గురువారం మండ లం లింగాపూర్ గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో ఈనెల 20 న జరిగే పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్స వానికి హాజరు కావాలని పటాన్ చెరువు లో గల మెదక్ ఎంపి అభ్యర్థి స్వగృహంలో నీలం మధు ముదిరాజ్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి లకు లింగా పూర్ గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు ఆహ్వానపత్రిక అందించారు. అనంతరం నాయకు లు పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి హాజరవుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఏస్ పార్టీల నుండి పలువురు లింగాపూర్ ముదిరాజ్ సంఘం నాయ కులు నీలం మధు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ల ఆధ్వ ర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి నీలం మధు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గాంధారి లతా నరేందర్ రెడ్డి, శ్రీశైలం, లతో పాటు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిలో బీర్ఏస్ పార్టీ నుండి వి. కరుణాకర్, కొత్తపల్లి బాను, రామ స్వామీ, మస్కూ రి నర్సింలు, కొంగారి ప్రదీప్, సంజీవ్, బీజేపీ కొత్త పల్లి రాజు, దాసని మహిపాల్, దాసని అశోక్ తదితరులు ఉన్నారు.