పెద్దపల్లి ఎంపీ టికెట్ మాదిగలకే కేటాయించాలి

– ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు  కేశారపు నరేశ్ మాదిగ
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకే ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నరేశ్ మాదిగ అన్ని ప్రధాన పార్టీలకు ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఏర్పాటు చేసిన నాటి నుంచి కేవలం మాదిగలకు ఒకే సారి మాత్రమే  ప్రాతినిథ్యం వహించారన్నారు. జనాభా పరంగా అధికంగా ఉన్న మాదిగలకే రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.