
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ టీఆర్ఎస్ఎంఏ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గన్ని గోదావరిఖనిలో గల గీతాంజలి హై స్కూల్ లో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో గల అన్ని పాఠశాలల కరస్పాండెంట్ లు హాజరై, పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ఎంఏ సంఘ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా పరిపాటి ఆంజి రెడ్డి ,అధ్యక్షులుగా కంది రవీందర్ రెడ్డి, (రామగుండం) , ప్రధాన కార్యదర్శిగా చందుపట్ల తిరుపతి రెడ్డి, (రామగిరి), ఉపాధ్యక్షులుగా పి సీతా రామాచారి, (రామగుండం) , వర్కింగ్ ప్రెసిడెంట్ గా జైన సురేష్ (ధర్మారం), కోశాధికారి గా మహేందర్ (ధర్మారం) , జాయింట్ సెక్రటరీ గా బి తిరుపతి (పాలకుర్తి) గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.