గత రెండు రోజులు గా వాతావరణం మేఘావృతమై ఉండి రోజంతా సన్నని జల్లులు పడటంతో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం గుమ్మడి వల్లి పంచాయితీ పరిధిలో గల చిన్నతరహా నీటి తరహా ప్రాజెక్ట్ అయిన పెద్దవాగు ప్రాజెక్ట్ లో జల కల సంతరించుకుంది. ఈ ప్రాజెక్ట్ కు దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో వాగులు,కాలువలు ద్వారా వర్షపు వరద చేరుతుంది. ఈ రెండు మండలాల్లో శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకు అశ్వారావుపేట లో 24.8 మి.మీ,దమ్మపేట లో 20.0 మి.మీ వర్షపాతం నమోదు అయింది.మొత్తంగా 44.8 మి.మీ వర్షపాతం నమోదు అయింది. ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 6.10 మీటర్లు.శనివారం సాయంత్రం వరకు 4.75 మీటర్లు నీరు చేరింది.5.30 మీటర్లు వరద చేరితే నీటి విడుదల చేస్తామని ఐ.బి ఏఈఈ కేఎన్బీ ప్రసాద్ తెలిపారు.