పాదచారుల భద్రతకు పెద్దపీట

Pedestrian safety is paramount– హైదరాబాద్‌ నగరంలో మరిన్ని పెలికాన్‌ సిగల్స్‌
–  ప్రస్తుతం 78 చోట్ల పెలికాన్‌ సిగల్స్‌
–  ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
హైదరాబాద్‌ మహానగరంలో జనాభా పెరుగుదలతోపాటు వాహనాల సంఖ్య అధికమై.. ట్రాఫిక్‌ ఇబ్బందులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. బయటికెళ్లితే.. ట్రాఫిక్‌లో ఇరుక్కుని గమ్యస్థానం చేరేసరికి గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. కొందరు వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలు నడిపించడం, మరికొందరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, ఇంకొందరు రెడ్‌సిగల్స్‌ వద్ద వాహనాలను ఆపకుండా దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. అందులో మరణాల్లో పాదచారులవి అధిక సంఖ్యలో ఉంటున్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో రద్దీగా ఉండే రోడ్లపై పాదచారులు రోడ్డు దాటాలంటే గగనంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి రాత్రి 12గంటల వరకు కూడా ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల మరణాలలో దాదాపు 60కిపైగా పాదచారుల మరణాలే ఉన్నాయి. ఫుట్‌పాత్‌లను అక్రమించే వారిపై చర్యలు తీసు కుంటూ.. ఫుట్‌పాత్‌లను విస్తరిస్తున్నా రోడ్డు ప్రమాదా లు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా పాదచారులకు సురక్షిత మైన ప్రయాణం, వారి భద్రతలో భాగంగా పోలీస్‌శాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా కార్యాచరణ అమలు చేస్తు న్నాయి. సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.8.5 కోట్లతో ట్రై పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 78 చోట్ల పెలికాన్‌ సిగల్స్‌ ఏర్పాటు చేశారు. గత మేలో నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ట్యాంక్‌బండ్‌పై సిగల్స్‌ ప్రారంభించారు.
కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం
ఏ.టీ.ఎస్‌.సీ, పెలికాన్‌ సిగల్స్‌ మొత్తం 404 ఏర్పాటు చేశారు. అందులో 169 పాత సిగల్స్‌ కాగా 113 కొత్త ఏ టీ.ఎస్‌.సీ సిస్టమ్‌ ద్వారా మొత్తం 282 సిగల్స్‌తోపాటు పాదచారుల భద్రత కోసం 78 పెలికాన్‌ సిగళ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని పెలికాన్‌ సిగళ్లు ఏర్పాటు చేయనున్నారు. నగరంలో 404 సిగల్స్‌ను 57 కారిడార్లులో ఏర్పా టు చేశారు. నాన్‌ కారిడార్‌లో గల 44 సిగల్స్‌ను ఆధునీక రించి కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయనున్నా రు. రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మరిన్ని పెలికాన్‌ సిగల్స్‌ అందు బాటులోకి రానున్నాయి.
గ్రూపులుగా..
పెలికాన్‌ సిగల్‌ అనేది మానవీయ ంగా నిర్వహించబడే సిగల్‌ వ్యవస్థ. వాహన సిగల్‌ను రెండు వైపులా ఎరుపు రంగులోకి మార్చడం ద్వారా పాదచారులు సురక్షితంగా రోడ్డును దాటొచ్చు. విదేశాల్లో పెలికాన్‌ క్రాసింగ్‌లు సర్వసాధారణం అయినప్ప టికీ, ఇక్కడ మన నగరంలో సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఒక్కో సిగల్‌ వద్ద కనీసం 10 మంది పాదచారులు చేరగానే 15 సెకండ్లపాటు సిగల్‌ను ఆన్‌ చేస్తారు. ఒకసారి ఈ సిగల్‌ వేసిన తరువాత మళ్లీ సిగల్‌ వేయాలంటే కనీసం మూడు నిమషాల వరకు ఆగాలి. పాదచారు లకు, రోడ్డుపై ట్రాఫిక్‌కు ఇబ్బం దులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. సిగల్‌ ఆపరే టింగ్‌ కోసం ట్రాఫిక్‌ సిబ్బందిని ఉపయోగించడం వల్ల సిబ్బం ది కొరత ఏర్పడుతుందనే ఉద్దే శంతో వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి ఎలా ఉపయోగించా లనే దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ వాలంటీర్లు ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు సిగల్స్‌ వద్ద విధుల్లో ఉంటారు.
సిగల్‌ వ్యవస్థను మరింత మెరుగు పర్చాలి
పాదచారుల భద్రత కోసం నగరంలో మరిన్ని పెలికాన్‌ సిగల్స్‌ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ అధికారులను ఆదేశించారు. సిగల్‌ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు మంగళవారం ఈ.ఎన్‌.సి, పోలీస్‌, ఎలక్ట్రిసిటీ అధికారులతో కలిసి సమీక్షించారు. మరిన్ని పెలికాన్‌ సిగల్స్‌ అందుబాటులోకి వస్తే ద్వారా 20 నుంచి 30 శాతం ప్రయాణ సమయం ఆదా అవుతుందని పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ సుధీర్‌బాబు అభిప్రాయపడ్డారు.
రోడ్డు ప్రమాదాల నివారణ..
పాదచారుల కోసం నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి లను పాదచారులు ఎక్కువ సంఖ్యలో ఉపయో గించడంలేదు. ఈ నేపథ్యంలోనే పెలికాన్‌ సిగల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన ట్యాంక్‌బండ్‌, మెహిదీపట్నం, జుబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, అబిడ్స్‌, ట్యాంక్‌బండ్‌, హిమాయత్‌నగర్‌, బేగంపేట్‌ ప్రాంతాల్లో ఈ సిగల్స్‌ ఏర్పాటయ్యాయి.