బీఆర్ఎస్ లో చేరిన పెద్దగుండవెళ్లి యువత

– బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసిన  యువత
– ఎంపీ సమక్షంలో 20 మంది బీఆర్ఎస్ లో చేరిక 
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన 20 మంది యువత బీజేపీ , కాంగ్రెస్ పార్టీ యువత రాజీనామా చేశారు.గురువారం మండల పరిధిలోని పోతారంలో మెదక్ ఎంపీ,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి  సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి  ఆహ్వానించారు.ఈ సందర్భంగా మెదక్ ఎంపీ మాట్లాడుతూ… గెలిచినా ఎమ్మెల్యే రఘునందన్ రావు మోస పూరిత మాటలు నమ్మి యువత మోసపోయారని, బీఆర్ఎస్ పాలనతోనే దుబ్బాక నియోజవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మి నేడు పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తదనతరం బీజేపీ సీనియర్ కార్యకర్త ఆటకారి చంద్రం మాట్లాడుతూ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలుపు కోసం పని చేస్తే తమను పట్టించుకోలేదని వాపోయారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలకు ఆహర్షితులై, కేసీఆర్ ని బలపరిచిన దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి  గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు.