వస్తున్నారు పీలింగ్స్‌

Peelings are comingఅయ్యో
‘కళ’లలోకి
నా కలలను ఒంపుకున్నానే
భ్రమలోకంలో విహరించి
అదశ్యం అవుతా అనుకోలేదు
వెర్రికి అభిమానం చుట్టుకుంటుందనుకోలేదు
రక్తాన్ని నిరంతరం మరిగిస్తున్న
ఓ సూరీడుళ్లరా..
ఆవేశపు బురదలో జారిపడితే
జీవితం తొక్కిసలాటలో నలిగిపోతుంది
ఆనందాల హరివిల్లులు
ఎగిరి గంతులేసే స్టెప్పులు
విషాదపు గీతం వినపడుతోందని
కళామతల్లి గుండెలు బాదుకొంటోంది.
అదిగో శవయాత్రలకు కరెన్సీ ‘పుష్పా’ లు
శవాల నత్యం పీలింగ్స్‌ని
కరెన్సీతో కొనుక్కున్నట్టుంది
‘పీలింగ్స్‌’ వస్తున్నారు.
– బాలు.ఎన్‌