
భువనగిరి మండలంలోని మన్నెవారిపంపు గ్రామంలో మొహరం పండుగలో భాగంగాపీర్ల పండుగను కులమతాలకతీతంగా ఘనంగా జరుపుకున్నారు. బుధవారం గ్రామంలో ఇంటింటికి రాగా ప్రజలు, భక్తులు ఊదు బెల్లం తో కుడుకలు దట్టీలు సమర్పించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. సాయంత్రం పీర్లను ఊరేగింపు నిర్వహించిన అనంతరం మక్కకు (బావిలో వేశారు) సాగనంపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు బోయిని గండయ్య, పెంటయ్య, హరినాథ్, మాజీ సర్పంచ్ బోయినీ పాండు, మెడబోయిన రాజయ్య, జహంగీర్, మెరుగు నరసింహ, హరినాథ్, గణేష్, బోయిని మల్లేశం, జంగయ్య, శ్రీనివాస్, అంకర్ల కిషన్, బోయిని మదన్, మధు, సాయి కిరణ్, ఉపేందర్, మధు, మణికంఠ, గోరేమియా, సలీం సాజిత్ లు పాల్గొన్నారు.