‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేశ్ వర్రే దీన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఈ చిత్ర హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అద్భుతంగా ఉంది. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు. ‘ఈ ‘పేక మేడలు’ కథ నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ చిత్రానికి వినోద్, అనూష యాప్ట్. వాళ్లిద్దరిమీదే సినిమా నడుస్తుంది. మంచి కమిట్‌మెంట్ ఉన్న హీరో విశ్వక్‌సేన్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవ్వడం ఆనందంగా ఉంది’ అని నిర్మాత రాకేశ్ వర్రే చెప్పారు. దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ,’అనీస్ కురువిళ్లా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. అప్పుడే ఈ కథ నా మనసులో మెదిలింది. బస్తీ లైఫ్ ఎలా ఉంటుంది. అక్కడ ఎవరు పేక మేడలు కడతారు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం చేశాం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదురయ్యే కథ ఇది. ఇలాంటి కథ బయటకు వెళ్తే బజ్ క్రియేట్ అవుతుందని నమ్మి చేశాం’ అని తెలిపారు. ‘ ‘ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది’ అని హీరో వినోద్ చెప్పారు. హీరోయిన్ అనుష మట్లాడుతూ,’ ఇంత మంచి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వరుణ్ బోర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కేతన్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: అనూష బోర, డి ఓ పి: హరిచరణ్.కె, సంగీతం: స్మరన్, ఎడిటర్: సజన అడుసుమిల్లి – హంజా అలీ, స్క్రీన్ ప్లే : హంజా అలీ -శ్రీనివాస్ ఇట్టం-నీలగిరి మామిళ్ళ, డైలాగ్స్ – లిరిక్స్ : భార్గవ కార్తీక్.