యూనిక్‌ కథతో పేక మేడలు

యువ నటుడు రాకేష్‌ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై హీరోగా చేసిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. తాజాగా ఆయన తన సొంత బ్యానర్‌పై ‘పేకమేడలు’ అనే నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘నా పేరు శివ’, ‘అందగారం’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన వినోద్‌ కిషన్‌, నూతన నటి అనూష కష్ణను తెలుగు తెరకి హీరో హీరోయిన్లుగా, నీలగిరి మామిళ్ళ అనే నూతన దర్శకుడితో పాటు 50 మంది నూతన నటీనటులు, ఎంతో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తున్నారు. ‘పేకమేడలు’ చిత్ర పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ని చిత్రబృందం బుధవారం రిలీజ్‌ చేసింది. యూనీక్‌ స్టోరీలైన్‌తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు.