– ఏపీ, తెలంగాణ ఆస్తుల విభజనపై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
– మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి
– రెండు వారాల్లో రిజాయిండర్లు దాఖలు చేయండి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఉమ్మడి ఆస్తుల విభజనలో జరుగుతున్న జాప్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది మఫూజీ నజ్కీ వాదనలు వినిపిస్తూ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనకు ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రామసుబ్రమణియన్‌ను మధ్యవర్తిగా నియమించాలని కోరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, న్యాయవాది పీచర శ్రీహర్ష అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ వైఖరి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదనీ, కేంద్రం కౌంటర్ దాఖలు చేసిన తరువాత దాని