
నవతెలంగాణ – భగత్ నగర్
శాతవాహన యూనివర్సిటీ లో జరిగిన అవినీతి ,అవకతవకల ఫై ఫై విచారణ జరిపించాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పెంచాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం శాతవాహన విశ్వవిద్యాలయ ఇంచార్జ్ ఉపకులపతి సురేంద్రమోహాన్ ను కలిసి సిబ్బంది సమస్యలతో సహా, యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలకు ఫై ఫిర్యాదు చేశారు. ఈ నెల మే 31 శుక్రవారం ,పరిపాలన భవనంలో మాయమైన ఫైళ్లపై సీసీ కెమెరాల రికార్డు పరిశీలించి విచారణ చేపట్టాలని కోరారు .అనంతరం పెంచాల శ్రీనివాస్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా నియమించిన ఫైనాన్సు ఆఫీసర్ ఎం.రవీందర్ ను తొలగించి నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు . విశ్వవిద్యాలయం లోని పలు అవినీతి అధికారుల కార్యకలాపాల ఫై విచారణ , అక్రమ నియామకాలు, అక్రమ ప్రమోషన్లు, 12-బి తప్పుడు నివేదిక, బిల్డింగ్ నిర్మాణంలో అవకతవకలు, పరీక్ష జవాబు పత్రాల స్కానింగ్ లో అవినీతి లాంటి పలు సమస్యలని ఇన్ఛార్జ్ వి సి దృష్టి కి తీసుకురాగ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
మీడియా ను అడ్డుకున్న సిబ్బంది
శాతవాహన యూనివర్సిటీ లో జరుగుతున్న అవకతవకల ఫై వస్తున్నా ఆరోపణ ల ఫై సంబంధిత అధికారుల వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు యూనివర్సిటీ కి వెళ్లగా వారిని సిబ్బంది అడ్డగించి ,లోపలి అనుమతి లేదని తెలిపారు. దీని ఫై సెక్యూరిటీ ఇంచార్జి ను వివరణ కోరగా వి సి ఆదేశాలతోనే అనుమతించడం లేదని తెలిపారు.