పెంచలరెడ్డి సేవలు మరువలేనివి

– మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ తంగ లక్ష్మారెడ్డి
– భగత్‌ సింగ్‌ నగర్‌లో 27 వ వర్ధంతి వేడుకలు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, చింతల్‌ డివిజన్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ ప్రాంత పేద ప్రజల అభ్యున్నతికి, ఈ ప్రాంత అభివద్ధికి నిరంతరం కషి చేసిన వ్యవస్థాప కులు కీర్తిశేషులు యాలమురి పెంచలరెడ్డి సేవలు మరువలేనివని కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ తంగ లక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమ వారం పెంచలరెడ్డి 27 వ వర్ధంతి పురస్కరించుకొని భగత్‌ సింగ్‌ నగర్‌లోని ఆయన విగ్రహానికి వారి కుటుంబసభ్యులు, బస్తీ వాసులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పరితపించేవారని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్ర మంలో పెంచలరెడ్డి కుమారుడు యలమూరి జనార్థన్‌ రెడ్డి, దళిత చైతన్య కళామండలి అధ్యక్షులు నిషాని చందర్‌, భగత్‌ సింగ్‌ నగర్‌ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ బి.సత్యం, అంబేద్కర్‌ సంఘం అధ్యక్షులు జెల్లా వెంకటేష్‌, డేగల కష్ణమూర్తి, భగత్‌ సింగ్‌ నగర్‌ సీనియర్‌ నాయకులు సిహెచ్‌.రమేశ్‌, ఏ.రాజిరెడ్డి, బీసు వెంకటేశ్‌ గౌడ్‌, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.