పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం చూపాలి 

Pending applications should be resolved– అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – సిరిసిల్ల
ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిష్కరిచడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు రమేష్, రాజేశ్వర్, అన్ని మండలాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.