మధ్యాహ్నభోజనం కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి

– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు 
నవతెలంగాణ-అచ్చంపేట
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు,  కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. లింగాల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నేడు చలో అచ్చంపేట ఆర్డిఓ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 6. నెలల పెండింగ్ బిల్లులు,  జీతాలు, కోడి గుడ్ల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనము రూ 26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మధ్యాహ్న భోజన కార్మికులకు అధికారంలోకొస్తే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పినారు. 8 నెలలు అవుతున్న ఇంతవరకు  అమలు చేయడం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు గుడ్లు, కూరగాయలు వడ్డీలకు అప్పు తెచ్చి పిల్లలకు భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిండర్ పొయ్యి లేక కట్టెల పొయ్యి మీద వంట చేసి కళ్ళు మసకలు వాడుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్లు ఇవ్వాలని పిల్లలకు ఒక పిల్లవాని మీద పది రూపాయలు చెల్లించాలని అన్నారు. రేపు జరిగే ఆర్డిఓ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల నూతన కమిటీ 
అధ్యక్షులుగా రాములమ్మ, కార్యదర్శి మంగమ్మ, ఉపాధ్యక్షులు సరిత, అలివేల, సహాయ కార్యదర్శిగా గోరెమ్మ, సరస్వతి, కోశాధికారి అచ్చమ్మ,  సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మల్లేష్ ఉన్నారు.