ఉపాధి హామీ కూలీల పెండింగ్‌ బిల్లులు వెంటనే ఇవ్వాలి

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి అంజయ్య
నవతెలంగాణ-యాచారం
ఉపాధి హామీ కూలీల పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. అంజయ్య డిమాండ్‌ చేశారు. వ్యకాస కేంద్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం యాచారం మండలంలో కూలీల పెండింగ్‌ బిల్లులు తదితర సమస్యలు పరిష్క రించాలని సూపరింటెండెంట్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఉపాధి హామీ చట్టంలో ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేయడానికి ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. కూలీలకు రెండు, మూడు నెలలుగా పనిచేసిన డబ్బులు చెల్లించకపోతే వారు బతికేదెలా అని నిలదీశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఉపాధీ కూలీల పెండింగ్‌ డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమన్నారు. ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమ ర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీల డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కె. జంగయ్య, శివ, కష్ణ, లక్ష్మణ్‌, సంజీవ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.