మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా సహా కార్యదర్శి బోడ భాగ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మండల కేంద్రంలోని హై స్కూల్ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోడ భాగ్య మాట్లాడుతూ.. సంవత్సర కాలంగా కోడిగుడ్ల బిల్లును చెల్లించడం లేదని నెలల తరబడి ఇతర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల గౌరవ వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తక్షణమే ఇచ్చిన హామీనీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న బోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫామ్ ఇవ్వాలని సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ మధ్యాహ్న భోజన కార్మికులు బిపాషా తస్లీమా రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.