పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి: ఎం.ఏ.ఖాద్రీ

Pay pending bills immediately: MA Qadri

– ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయలేక పోతున్నాం
నవతెలంగాణ – శంకరపట్నం
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి  తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు.ఈసందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్లు కట్టుకోలేక సతమతమై ఆత్మ క్షోభకు గురియై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారికీ  సంబంధించిన సప్లిమెంటరీ సాలరి, సరెండర్, మెడికల్, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్, టీ జీ జీ ఎల్ ఐ, పార్ట్ ఫైనల్  బిల్స్ తదితర బిల్లులు పెండింగ్లో ఉండడంతో చాలామంది అసహనానికి గురవుతున్నారన్నారు.పదవి విరమణ పొందిన ఉద్యోగుల పీఆర్సీ ఏరియర్స్, గ్రాట్యుటీ వివిధ రకాల చెల్లింపుల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని, అకాలమరణం చెందిన ఉద్యోగ ఉపాధ్యాయుల మరణాంతర ఆర్థిక చెల్లింపుల కోసం వారి కుటుంబ సభ్యులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వాళ్ళ పరిస్థితి దీనావస్థలో పోతుందని వెంటనే ప్రభుత్వం స్పందించి  తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.దీనావస్థతో పెండింగ్ బిల్లుల కోసం  ఎదురు చూస్తూ ఇంటి లోన్, పర్సనల్ లోన్ ఇఎంఐ  భారాలతో గుండె దడదడతో  బిక్కు బిక్కుమని ఆవేదనతో ఎదురు చూస్తున్నారన్నారు. బిల్లులను సత్వరమే చెల్లింపులు చేయాలని, ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫేవరేట్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వాల ఇప్పటి పరిస్థితుల్ని చూసి 1.87 తేడా యే తారుమారు చేస్తుంతుందని గుర్తు చేశారు.