పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి..

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని హుస్నాబాద్ ఏసీపి సతీష్ డివిజన్ అధికారులకు సూచించారు. శనివారం హుస్నాబాద్ లో నేర సమీక్ష సమావేశాన్ని ఏసీపి కార్యాలయంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాల నియంత్రణకు రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తుల సంచారం పై ప్రత్యేక నిఘా కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఏర్రల్ల కిరణ్, హుస్నాబాద్ ఎస్సై మహేష్, అక్కన్నపేట ఎస్ ఐ వివేక్, కోహెడ ఎస్ఐ తిరుపతి, మద్దూరు, నంగునూరు, చేర్యాల ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.