నవతెలంగాణ-కాగజ్‌నగర్
ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాగజ్‌నగర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో చేపట్టారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ పీఆర్‌సీ నివేదిక తెప్పించుకొని జాప్యం లేకుండా అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని, అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించి, బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్వశిక్షా అభియాన్, కేజీబీవీ, యూఆర్‌ఎస్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, ఆశ్రమ, మరియు గురుకులాలలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్‌టీలకు, గెస్ట్, పార్ట్‌టైం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 12 నెలల వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లలిత, సభ్యులు రాజకమలాకర్‌రెడ్డి, వేణి, సబిత పాల్గొన్నారు.