పెండింగ్ డి.ఎ.లను వెంటనే విడుదల చేయాలి

నవతెలంగాణ కంఠేశ్వర్ 
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం జిల్లా అధ్యక్షులు  కే.రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు భోజారావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు డిఏలు రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని, దీని మూలంగా  రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా పీఆర్సి కమిటీని వెంటనే రిపోర్టు విడుదల చేసేలా 30%తో ఫిట్మెంట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మదన్మోహన్ జిల్లా కోశాధికారి ఈ.విల్.నారాయణ, ఉపాధ్యక్షులు లావు వీరయ్య జిల్లా నాయకులు వెంకట్రావు, శిర్ప హనుమాన్లు, దీన సుజన, ప్రసాద్ రావు, రాధాకృష్ణ, సిర్ప లింగం తదితరులు పాల్గొన్నారు.