నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ ను విడుదల చేయాలని పీడీఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ డిమాండ్ చేశారు. బుధవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు పెండింగ్ లో ఉన్న కారణంగా పేద విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొందని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ అన్నారు. చదువులు పూర్తి అయిన వారికి కళాశాలల యాజమన్యాలు ఫీజులు రాని కారణంగా సర్టిఫికెట్లను ఇవ్వడం లేదన్నారు. దీంతో వారు పై చదువులు చదవలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ తో పాటు ఫీజురింబర్స్మెంట్, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగేందర్, మారుతి, శ్రీకర్, దీపలక్ష్మీ, హరీష్, దత్తాత్రి పాల్గొన్నారు.