– స్కాలర్‌షిష్‌లూ ఇవ్వాలి : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
నవతెంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో గత ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 8 వేల కోట్ల ఫీజులను విద్యార్థులకు రియింబర్స్ చేయడంతోపాటు స్కాలర్‌షిప్‌లనూ విడుదల చేయాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి. నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఫీజులను విడుదల చేయకపోవడం వల్ల ఇప్పటికే చాలా రకాల ప్రవేశ పరీక్షలు పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు.
పేద విద్యార్థులు అప్పులు చేసి మరి సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఒక ప్రక్కన విద్యార్థులు ఇబ్బందులు పడు తుంటే, మరోవైపు యాజమాన్యాలు అప్పులు తెచ్చి కాలేజీలు నడిపిస్తు న్నామంటూ సిబ్బందికి జీతాలు చెల్లించలేమని చెబుతున్నాయని వివరిం చారు. సోమవారం నుంచి కళాశాలల బంద్‌కు యాజమాన్యాలు పిలుపు నిచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం యాజమాన్యా లతో చర్చించి పేద విద్యార్థులకు నష్టం కలగకుండా నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో డిగ్రీ, పీజీ కళాశాలలు కంటే, ప్రయివేటు రంగంలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వాటిలో చదువు తున్న పేద ఎస్సీ, ఎస్టీ, బిసీ మైనారిటీ విద్యార్థులే నష్టపో తారని చెప్పారు. ఒక ప్రక్కన విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పుల పేర అంతర్జాతీయ పాఠశాలలను ప్రారంభం చేస్తూనే, మరోవైఉ విద్యార్థులకు ఫీజులను గత ప్రభుత్వంలాగే చెల్లించడం లేదన్నారు. విద్యారంగానికి ప్రాధాన్యత తగ్గించి విద్యను ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతు న్నాయని వ్యాఖ్యానించారు. తక్షణమే ప్రభుత్వం ఫీజులను విడుదల చేయాలనీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.